కివీస్‌ సవాల్‌! | Sakshi
Sakshi News home page

కివీస్‌ సవాల్‌!

Published Mon, Jan 21 2019 1:18 AM

Indian team reaches Auckland for New Zealand tour  - Sakshi

చరిత్రను తిరగరాయడం, పాత రికార్డులను చెరిపేసి కొత్త ఘనతలు సృష్టించడం భారత క్రికెట్‌ జట్టుకు ఇటీవల అలవాటుగా మారింది. ఆస్ట్రేలియాలో సిరీస్‌ నెగ్గిన మన టీమ్‌ తర్వాతి మజిలీ న్యూజిలాండ్‌. ఈ టూర్‌ తర్వాత స్వదేశంలో మరికొన్ని మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా... వరల్డ్‌ కప్‌నకు ముందు విదేశీ పిచ్‌లపై మన పదును తెలుసుకునేందుకు ఈ సిరీస్‌ మరో అవకాశం ఇస్తోంది. ఆసీస్‌తో పోలిస్తే సొంతగడ్డపై కివీస్‌ అతి ప్రమాదకర ప్రత్యర్థి అన డంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో గతంలో న్యూజిలాండ్‌లో భారత ఆడిన ఏడు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ విశేషాలను చూస్తే... 

నేడు ప్రాక్టీస్‌... 
ఆక్లాండ్‌: ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న భారత జట్టు ఆదివారం కివీస్‌ గడ్డపై అడుగు పెట్టింది. టీమిండియా ఆటగాళ్లంతా ఆక్లాండ్‌ నగరానికి చేరుకున్నారు. స్థానికంగా ఉన్న భారత అభిమానులు విమానాశ్రయంలో కాస్త సందడి చేశారు. తొలి వన్డే వేదిక అయిన నేపియర్‌కు భారత్‌ సోమవారం బయల్దేరుతుంది. అక్కడ నేడు, రేపు ప్రాక్టీస్‌ అనంతరం బుధవారం న్యూజిలాండ్‌తో తలపడుతుంది.  

మహిళలూ అక్కడే... 
బుధవారం భారత్, కివీస్‌ జట్ల మధ్య తొలి వన్డే నేపియర్‌లో జరగనుండగా... మరుసటి రోజు గురువారం ఇదే వేదికపై భారత మహిళల, కివీస్‌ మహిళల మధ్య కూడా సిరీస్‌లో తొలి వన్డే జరగనుండటం విశేషం.  
1976 (2 వన్డేలు)  
ఫలితం: 2–0తో సిరీస్‌ కివీస్‌ సొంతం

1981 (2 వన్డేలు)  
ఫలితం: 2–0తో సిరీస్‌ కివీస్‌ సొంతం 

1994 (4 వన్డేలు) 
ఫలితం: 2–2తో సిరీస్‌ సమం

1999 (5 వన్డేలు)  
ఫలితం: 2–2తో సిరీస్‌ సమం (ఒక మ్యాచ్‌ రద్దు)

2002–03 (7 వన్డేలు) 
హా ఫలితం: 5–2తో కివీస్‌ విజయం

2009 (5 వన్డేలు) 
ఫలితం: 3–1తో భారత్‌ విజయం (ఒక మ్యాచ్‌ రద్దు)

2014 (5 వన్డేలు) 
ఫలితం: 4–0తో కివీస్‌ విజయం  (ఒక మ్యాచ్‌ ‘టై’)
న్యూజిలాండ్‌ గడ్డపై 7 సిరీస్‌లు ఆడిన భారత్‌ 1 గెలిచి, 4 ఓడిపోయింది. మరో 2 ‘డ్రా’గా ముగిశాయి. ఓవరాల్‌గా ఇరు జట్ల మధ్య 34 వన్డేలు జరగ్గా... భారత్‌ 10 గెలిచి 21 ఓడిపోయింది. 1 మ్యాచ్‌ ‘టై’ కాగా, మరో 2 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు.   

Advertisement
Advertisement